பிரமிளா கோஸ்வாமி எழுதிய பூண்டி

బూందీ ఇది మన దేశంలో అతి ప్రాచీన పారంపర్యమైన తీపి వంట‌కం.దాదాపు అన్ని రాష్ట‌్రాల వారు చేస్తుంటారు. కానీ దీన్ని తయారు చేయడం లో కాస్త ప్రావీణ్యత ఉండాలి. అప్పుడే అది ముత్యాల లాగా గుండ్రంగా పడి పంచదార పాకాన్ని బాగా పీల్చుకుని రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం!కావలసిన పదార్ధాలు_సెనగపిండి 1కప్పు,పంచదార 1.5కప్పు.నెయ్యి లేక రిఫైన్డ్ సన్ఫ్లవర్ నూనె కానీ నేతిలో చేస్తేనే రుచి!ఆరంజ్ కలర్ పావు స్పూన్, కుంకుమపువ్వు,ఏలకుల పొడి! సెనగపిండి లో కాస్త ఆరంజ్ కలరు ఒక కప్పు నీళ్ళు వేసి కలపాలి.ఇంకా దాదపు అర కప్పు నీళ్ళు కలిపి మరీ పలచగా కాకుండా జారుడు గా పిండి కలుపుకోవాలి. ఈలోపున పంచదార మునిగేలా నీళ్ళు పోసి కలరు,కుంకుమ పువ్వు వేసి తీగపాకం చేసుకుని పక్కకి పెట్టుకోవాలి. అందులో ఏలకులపొడి కలపాలి. బాణలి లో నెయ్యి బాగా కాగిన తరవాత కలిపిన సెనగపిండి బూందీ చట‌్రం లో గరిట‌ తో జాగ్రతగా పొయ్యాలి. వేగిన బూందీ ని పంచదార పాకం లోవేసి కనీసం గంట‌ సేపు నాననివ్వాలి.పైన బాదం పిస్తాల తో అలంకరించి సర్వ్ చేయాలి!

4.3/5
Views
0 k